స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు
బ్యాటింగ్లో విఫలమైనా విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు.
Virat Kohli


హైదరాబాద్, 07 నవంబర్ (హి.స.)

బ్యాటింగ్లో విఫలమైనా విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు.

న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో కేవలం ఏడు పరుగులు చేసి ఔటైనప్పటికీ కివీస్పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచి ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ రికార్డును దాటేశాడు.

కోహ్లి ఇప్పటివరకు న్యూజిలాండ్పై వన్డేల్లో 1,976 పరుగులు చేయగా పాంటింగ్ 1,971 పరుగులతో రెండో స్థానంలో ఉండిపోయాడు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ 1,750, కుమార సంగక్కర 1,568, సనత్ జయసూర్య 1,519 పరుగులతో ఉన్నారు. వెల్లింగ్టన్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ తీసుకుంది. భారత బౌలర్లు కలిసికట్టుగా చెలరేగడంతో న్యూజిలాండ్ 41 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. గుర్నూర్ బ్రార్ నాలుగు వికెట్లు తీయగా అక్షర్ పటేల్, అన్షుల్ కంబోజ్, ఆకిబ్ నబీ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. కివీస్ తరఫున డారిల్ మిచెల్ ఒక్కడే 55 పరుగులతో హాఫ్ సెంచరీ చేయగా మిగతా వారెవరూ నిలబడలేకపోయారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande