కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూరత్-చెన్నై ఎక్స్ప్రెస్వేపై షహాపూర్ తాలూకాలోని ఇబ్రహీంపూర్ దగ్గర ఓ కారు అదుపుతప్పి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని బలంగా ఢీకొట్టింది.
Accident


కర్ణాటక, 08 నవంబర్ (హి.స.)

కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూరత్-చెన్నై ఎక్స్ప్రెస్వేపై షహాపూర్ తాలూకాలోని ఇబ్రహీంపూర్ దగ్గర ఓ కారు అదుపుతప్పి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్రలోని తుల్జాపూర్లో ఉన్న భవానీ దేవి ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వేగంగా వచ్చిన కారు నేరుగా బ్రిడ్జి పియర్ను ఢీకొట్టి నుజ్జునుజ్జయింది. ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

మృతులను గురురాజ్ సురేష్ చవాన్ (29), రెడ్డి బాగ్లా రాథోడ్ (33), గోవింద సీత్య చవాన్ (28), కుమార్ రాము రాథోడ్ (26)గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న షహాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande