బాక్సాఫీస్ రికార్డులు సృష్టిస్తున్న 'రామాయణ' సినిమా
బాలీవుడ్లో వచ్చిన ‘రామాయణ’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.490.20 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
Ramayana


హైదరాబాద్, 09 నవంబర్ (హి.స.)

బాలీవుడ్లో వచ్చిన ‘రామాయణ’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.490.20 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

భారత్లో మొత్తం నెట్ కలెక్షన్లు రూ.238.85 కోట్లకు చేరగా, గ్రాస్ వసూళ్లు రూ.285.20 కోట్లుగా నమోదయ్యాయి. ఓవర్సీస్లో రూ.214 కోట్ల గ్రాస్ రావడంతో వరల్డ్ వైడ్ కలెక్షన్ రూ.490.20 కోట్లకు చేరింది.

దీపావళి రోజున ఒక్కరోజే భారత్లో రూ.50.15 కోట్ల నెట్ వసూళ్లు రావడం విశేషం. దీంతో ‘టైగర్ 3’ పేరిట ఉన్న రూ.44.50 కోట్ల దీపావళి రికార్డును ఈ సినిమా బద్దలు కొట్టింది. ‘సింగమ్ ఎగైన్’ రూ.43.50 కోట్లతో తర్వాతి స్థానంలో ఉంది. రోజుల వారీగా చూస్తే తొలి రోజు రూ.64.85 కోట్లు, రెండో రోజు రూ.48.05 కోట్లు, మూడో రోజు రూ.60.80 కోట్లు, నాలుగో రోజు రూ.50.15 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. మరోవైపు ప్రభాస్ ‘ఆదిపురుష్’ తొలి నాలుగు రోజుల్లో భారత్లో సాధించిన రూ.237 కోట్ల నెట్ వసూళ్లను కూడా ‘రామాయణ’ దాటేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande