
చెన్నై10, ఫిబ్రవరి (హి.స.): చెక్ బౌన్స్ కేసులో ‘కొచ్చడైయాన్’ సినిమా (తెలుగులో ‘విక్రమసింహ’) నిర్మాతకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. యాడ్ బ్యూరో సంస్థకు నాలుగు వారాల్లో రూ.2.5కోట్లు చెల్లించాలని లేదంటే ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది.
రజనీకాంత్ కథానాయకుడిగా ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 2014లో వచ్చిన 3డీ మోషన్ క్యాప్చర్ మూవీ ‘కొచ్చడైయాన్’. దీపిక పదుకొణె కథానాయిక. ఈ సినిమా నిర్మాణ పనులకు బెంగళూరుకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీడియా వన్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ డైరెక్టర్లలో ఒకరైన మురళీమనోహర్ రుణం తీసుకున్నారు. తిరిగి చెల్లింపుల్లో భాగంగా 2014లో మురళీమనోహర్ యాడ్ బ్యూరో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అబిర్ చంద్ నహర్‌కు రూ.5 కోట్ల చెక్ ఇచ్చారు. అది బౌన్స్ కావడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ