
గుంటూరు, 11 ఫిబ్రవరి (హి.స.)
, :రాష్ట్ర మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు.. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అలాగే ఆయనపై పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌నూ కొట్టివేసింది న్యాయస్థానం. ప్రస్తుతం.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి.. ఈ బెయిల్‌తో రేపు(గురువారం) జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అంబటికి బెయిల్ రావడంతో గుంటూరులోని ఆయన నివాసం వద్ద వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, మాజీ మంత్రి అభిమానులు.. బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ