అధికార దుర్వినియోగానికి, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడటం దుర్మార్గం.
మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీశ్ రావు
kcr suspends daughter k kavitha from brs party


హైదరాబాద్, 11 ఫిబ్రవరి (హి.స.)

ముఖ్యమంత్రి మొదలుకొని..మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ నాయకులు అడుగడుగునా అధికార దుర్వినియోగానికి, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడటం దుర్మార్గం.

నామినేషన్ల దాఖలు మొదలు పోలింగ్‌ వరకూ కాంగ్రెస్ అనేక అరాచకాలకు పాల్పడటం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం.

బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను బెదిరించడమే గాక, వారిపై భౌతిక దాడులకు తెగబడటం హీనమైన రాజకీయ సంస్కృతికి నిదర్శనం.

చట్టాన్ని సైతం లెక్కచేయకుండా.. అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తిన కొందరు పోలీసుల తీరు గర్హనీయం.

ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ఇలాంటి నీచ రాజకీయాలకు తెగబడటం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమే.

కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలు, డబ్బు సంచులు, దుష్ట పన్నాగాలు ప్రజల తీర్పును ఏమాత్రం ప్రభావితం చేయలేవు.

అధికార పార్టీ ఆకృత్యాలకు అదరకుండా, బెదరకుండా BRS పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చివరి వరకు కృషి చేసిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇన్‌చార్జ్‌లకు అభినందనలు. శుభాకాంక్షలు.

బీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో తమ అమూల్యమైన ఓటు వేసిన ప్రతి ఓటరుకు హృదయ పూర్వక ధన్యవాదాలు.

*

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande