ప్రజాస్వామ్య పోరాటం. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిదీ.
హైదరాబాద్, 11 ఫిబ్రవరి (హి.స.)11-02-2026 హైదరాబాద్ బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రాంచందర్ రావు గారు పత్రిక ప్రకటన ముఖ్యాంశాలు: ************ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కును వినియోగించిన ఓటర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు
BJP भाजपा


హైదరాబాద్, 11 ఫిబ్రవరి (హి.స.)11-02-2026

హైదరాబాద్

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రాంచందర్ రావు గారు పత్రిక ప్రకటన

ముఖ్యాంశాలు:

************

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కును వినియోగించిన ఓటర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎన్నికల్లో అహర్నిశలు శ్రమించిన బిజెపి కార్యకర్తలు, నాయకులు, శ్రేణులందరికీ కృతజ్ఞతలు. ఖచ్చితంగా బిజెపి అనేక కీలక స్థానాల్లో విజయాన్ని సాధిస్తుందని మేము విశ్వసిస్తున్నాం.

నిన్న మక్తల్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునే ప్రయత్నంలో బిజెపి కార్యకర్తలపై బెదిరింపులకు, అధికార దుర్వినియోగానికి, ప్రచార సమయంలో అనేక అరాచకాలకు పాల్పడింది. మక్తల్‌లో బిజెపి అభ్యర్థి మహదేవప్ప గారి మరణం ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ హత్యగానే మేం భావిస్తున్నాం.

మంచిర్యాలలో కూడా బిజెపి కార్యకర్తలు, నాయకులను బెదిరింపులతో వేధించడం జరిగింది. ఇండ్లపై దాడులు చేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల డైరెక్షన్లతో పోలీసులు పనిచేయడం అప్రజస్వామిక చర్య.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ పట్టును కోల్పోతామనే భయంతోనే ఈ అరాచకాలకు పాల్పడింది. పోలింగ్ రోజున కూడా అనేక కేంద్రాల్లో బిజెపి కార్యకర్తలపై దాడులు చేసి, పోలింగ్ సెంటర్ల వద్ద నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ మా కార్యకర్తలు వెనుకడుగు వేయకుండా ధైర్యంగా నిలబడ్డారు. ఈ ఘటనలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశాం.

డబ్బు, అధికారబలం, అధికార మదంతో గెలవాలని ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య పాఠం చెప్తారని మేము విశ్వసిస్తున్నాం.

కాంగ్రెస్ పార్టీ పోలింగ్ బూత్‌ల వద్ద బహిరంగంగా, పోలీసుల సమక్షంలోనే, బూత్‌ల లోపల మరియు బయట విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ చేసింది. దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేదా పోలీసుల నుంచి సరైన స్పందన రాలేదు. రాష్ట్రంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిజంగా పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతోంది.

నారాయణఖేడ్, సుల్తానాబాద్, చెన్నూరు, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, ఖానాపూర్, సదాశివపేట్, ఎల్లంపేట్, వైరా, కొత్తగూడెం, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బెదిరింపులు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఈ చర్యలకు పాల్పడ్డారు.

ఒకవైపు ధన ప్రలోభాలు, మరోవైపు పోలీసు ఒత్తిళ్లు, నాయకుల బెదిరింపులు-ఇవన్నింటిని భరించి కూడా బిజెపి కార్యకర్తలు పార్టీ కోసం అంకితభావంతో కృషి చేశారు.

ఆనాడు ఇందిరా గాంధీ గారు అధికార దుర్వినియోగానికి పాల్పడిన కారణంగా కోర్టు డిస్‌క్వాలిఫై చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే విధానాన్ని అనుసరిస్తోంది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక స్థానాల్లో ఓటమి తప్పదని, బీఆర్ఎస్ పార్టీ కూడా అరకొర తప్పితే గెలిచేదేమీ లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము చెబుతున్నది స్పష్టం-ఇది ప్రజాస్వామ్య పోరాటం. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిదీ.

పోలీసులను అడ్డుపెట్టుకుని బిజెపి కార్యకర్తలపై దాడులు చేస్తే సహించబోం. బిజెపి కార్యకర్తలు ప్రతిఘటించి, ఎదురుతిరిగితే పరిస్థితులు దారుణంగా ఉంటాయి.

బిజెపి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధింపులకు భయపడి ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను అశాస్త్రీయంగా మూడు భాగాలుగా విభజించింది.

తమ రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం.. ఒక కార్పొరేషన్‌ను దారుస్సలాం కేంద్రంగా ఉన్న మజ్లిస్ పార్టీకి కట్టబట్టే ప్రయత్నం చేసింది.

కోర్ హైదరాబాద్‌ను మజ్లిస్‌కు తాకట్టుపెట్టే విధంగా జీహెచ్ఎంసీని విభజించి, జీహెచ్ఎంసీ (GHMC)తో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC)గా విభజించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande