
, కొలంబో 11 ఫిబ్రవరి (హి.స.)
టీ20 ప్రపంచ కప్ 2026 కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీలంక జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టుకు సంబంధించిన స్టార్ ఆటగాడు దూరమవుతున్నాడు. గాయం కారణంగా శ్రీలంక స్టార్ ప్లేయర్ వనిందు హసరంగ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నుంచి మొత్తానికి దూరమయ్యాడు.
అతని ఎడమ కాలి కండరాలలో చీలిక ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఎమ్మారై స్కానింగ్ చేయగా ఈ విషయం బయటపడిందట. ఈ న్యూస్ తెలియడంతో వెంటనే టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి వనిందు హసరంగను తప్పిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
శ్రీలంక స్టార్ ఆటగాడు వనిందు హసరంగ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతని స్థానంలో మరో ఆటగాడికి అవకాశం ఇచ్చారు. అసరంగా స్థానంలో లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ దుషన్ హేమంతకు శ్రీలంక జట్టులకు చోటు కల్పించారు. శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ఆదేశాలు రాగానే హుటా హుటిన బయలుదేరాడు దుషన్ హేమంత. ఇది ఇలా ఉండగా టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. మార్చి ৪৯ తేదీ కొనసాగానుంది. అయితే ఈ టోర్నమెంట్ లో ఫిబ్రవరి 8వ తేదీన ఐర్లాండ్ తో శ్రీలంక తలపడింది. ఈ సందర్భంగా అద్భుతంగా రాణించి శ్రీలంక విజయం సాధించింది. కాగా టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కు ఇండియాతో పాటు శ్రీలంక కూడా ఆతిథ్యం ఇస్తున్నాయి. పాకిస్తాన్ ఆడే ప్రతి మ్యాచ్ శ్రీలంకలో జరగనుంది. ఒకవేళ ఫైనల్ కు పాకిస్తాన్ వెళ్తే, వరకు అలా కాకుండా, కొలంబోలోనే ఫైనల్ ఉంటుంది. పాకిస్తాన్ ఫైనల్ కు రాకుంటే పరిస్థితి వేరేలాగా ఉంటుంది. పాక్ ఫైనల్ బరిలో లేకపోతే, ఇండియాలోనే ఫైనల్స్. ఈ మేరకు టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ ఖరారు అయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..