భారత్-పాక్ మ్యాచ్ పై వీడని ఉత్కంఠ.. పీసీబీకి ICC 24 గంటల గడువు
హైదరాబాద్, 09 ఫిబ్రవరి (హి.స.) టీ20 ప్రపంచకప్-2026లో అత్యంత ఆసక్తికరమైన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ నిర్వహణపై హైడ్రామా కొనసాగుతోంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చేస్తున్న పట్టువీడటంతో
Cricket


హైదరాబాద్, 09 ఫిబ్రవరి (హి.స.)

టీ20 ప్రపంచకప్-2026లో అత్యంత

ఆసక్తికరమైన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ నిర్వహణపై హైడ్రామా కొనసాగుతోంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చేస్తున్న పట్టువీడటంతో ఇప్పడు బంతి ఐసీసీ (ICC) కోర్టులోకి చేరింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా (Imran Khwaja) ఆదివారం లాహోర్కు చేరుకుని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi)తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ భేటీలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ప్రతినిధి అమీనుల్ ఇస్లాం బుల్బుల్ కూడా పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. బంగ్లాదేశ్ కు మద్దతుగా తాము భారత్తో ఆడబోమని ప్రకటించిన పాకు ఒప్పించేందుకు ఐసీసీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

భారత్తో మ్యాచ్ ఆడాలంటే తాము కోరిన డిమాండ్లకు అంగీకరించాలని పీసీబీ ఐసీసీ ముందు ప్రతిపాదనలు ఉంచినట్లుగా తెలుస్తోంది. భారత్లో పర్యటించేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి తొలగించినందున, వారికి తగిన ఆర్థిక నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బంగ్లాదేశ్ జట్టు ఆడకపోయినా వారికి దక్కాల్సిన పార్టిసిపేషన్ ఫీజును అందజేయాలని పేర్కొన్నారు. రాబోయే కాలంలో జరిగే ఐసీసీ మెగా ఈవెంట్లను పాకిస్థాన్లో నిర్వహించేందుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది.

ఐసీసీ ‘డెడ్ లైన్'.. లేకపోతే భారీగా ఫైన్

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంశంపై 24 గంటల్లోపు తుది నిర్ణయం చెప్పాలని ఐసీసీ, పీసీబీని ఆదేశించింది. ఒకవేళ మ్యాచ్ను బహిష్కరిస్తే పాకిస్థాన్ (Pakistan)కు దక్కాల్సిన వార్షిక నిధులపై కోత విధించడంతో పాటు, భారీ జరిమానాలు విధిస్తామని ఐసీసీ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. దీనిపై పీసీబీ తమ ప్రధానితో చర్చించి తుది ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు, శ్రీలంక క్రికెట్ బోర్డు (SCB) కూడా ఈ మ్యాచ్ నిర్వహణపై ఆశగా ఉంది. భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే తమకు భారీగా ఆదాయం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande