
హైదరాబాద్, 11 ఫిబ్రవరి (హి.స.)మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోందని ఎస్‌ఈసీ రాణికుముదిని తెలిపారు. వందశాతం వెబ్ కాస్టింగ్‌తో పోలింగ్ జరుగుతోందని వెల్లడించారు. సాయంత్రానికి పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఓటర్లు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెబ్ కాస్టింగ్ అనేది ఓటు వేయాలని అవగాహన కల్పించడమేనన్నారు. పండుగ వాతావరణంలో పోలింగ్ జరుగుతోందని, చెదురుమదురు ఘటనలు తప్ప ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్