ఎగ్జి పోల్స్లో అధికార పార్టీదే హవా
తెలంగాణ, 11 ఫిబ్రవరి (హి.స.) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్కు సమయం ఉండగా.. క్యూలో ఉన్నవారికి 5 గంటల తర్వాత కూడా ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. పోలింగ్ సరళి ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు (Municipal
Exit pols


తెలంగాణ, 11 ఫిబ్రవరి (హి.స.)

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల

ప్రక్రియ ముగిసింది. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్కు సమయం ఉండగా.. క్యూలో ఉన్నవారికి 5 గంటల తర్వాత కూడా ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. పోలింగ్ సరళి ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు (Municipal Election Exit Polls) వెలువడుతున్నాయి. 7 కార్పొరేషన్లలో మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్నగర్, కొత్తగూడెంను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని 'పీపుల్స్ పల్స్' ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా వేసింది. నిజామాబాద్, కరీంనగర్ను బీజేపీ దక్కించుకుంటుందని, బీఆర్ఎస్ ఒక్క కార్పొరేషన్నూ సొంతం చేసుకోలేదని పేర్కొంది. 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 68-76, బీఆర్ఎస్ 29-36, బిజెపి 3-5, mim 0-1, ఇతరులు 8-14 దక్కించుకుంటారని పేర్కొంది.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 13న ఉదయం 8 గంటలకు 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande