రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
తెలంగాణ, 11 ఫిబ్రవరి (హి.స.) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు మున్సిపాలిటీల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి, ఆలియాబాద్, ఎల్లంపేట్ మున్సిపాలిటీలలో పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ మను చౌదరి సాధార
పోలింగ్


తెలంగాణ, 11 ఫిబ్రవరి (హి.స.)

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు మున్సిపాలిటీల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి, ఆలియాబాద్, ఎల్లంపేట్ మున్సిపాలిటీలలో పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ మను చౌదరి సాధారణ ఎన్నికల పరిశీలకులు నిర్మల కాంతి వెస్లీతో కలిసి పరిశీలించారు. బుధవారం మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఆలియాబాద్ లోని జిల్లా పరిషత్ హై స్కూల్, మూడుచింతలపల్లిలోని జగ్గన్నూడ జిల్లా పరిషత్ హై స్కూల్, ఎల్లంపేట్ మున్సిపాలిటీలోని రాజ బొల్లారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులను సందర్శించి ఓటింగ్ ప్రక్రియను తనిఖీ చేశారు.

నారాయణఖేడ్ మున్సిపాలిటీకి సంబంధించి జరుగుతున్న ఎన్నికల సరళిని పరిశీలించిన సబ్ కలెక్టర్ ఉమా హారతి అనంతరం ఓటు హక్కును పోలీస్ వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి పోలీసు భద్రతను పెంచడం జరిగిందన్నారు.

పాల్వంచలోనే 27 డివిజన్లో కేటాయించిన పోలీస్ కేంద్రాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తనిఖీ చేశారు. బుధవారం ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలింగ్ జరుగుతున్న పరిశీలించి పోలీస్ అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande