
హైదరాబాద్, 11 ఫిబ్రవరి (హి.స.)
దేశానికి అన్నం పెట్టే రైతుకు కష్టాలు కొత్తవి కావు. ప్రకృతి కరుణించకపోయినా, కనీసం విధానాలైనా ఆదుకుంటాయన్న ఆశతోనే రైతు సాగు చేస్తాడు.. కానీ నేటి పరిస్థితుల్లో ప్రకృతి ప్రతికూలతల కంటే ప్రభుత్వ బలపడుతోంది. విధాన లోపాలే రైతును ఎక్కువగా గాయపరుస్తున్నాయన్న భావన ముఖ్యంగా యూరియా సరఫరా విషయంలో అమలవుతున్న విధానాలు.. రైతుకు ఊరటనివ్వాల్సింది పోయి రైతును మరింత సంక్షోభంలోకి నెట్టుతున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వరినాట్లు వేసి పంటను కాపాడుకోవాల్సిన కీలక సమయంలో యూరియా అందక రైతు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు... ఒకవైపు వాతావరణ అనిశ్చితి మరోవైపు సాగు ఇన్పుట్ ఖర్చుల పెరుగుదల.. దీనికి తోడు యూరియా కోసం పడుతున్న అవస్థలు రైతును మానసికంగా, ఆర్థికంగా తీవ్రంగా కుంగదీస్తున్నాయి. యూరియా సరఫరాలో ప్రభుత్వం ఒకే రాష్ట్రంలో, ఒకే రైతుకు రెండు విధానాలు అమలు చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం సహకార సంఘాలకు రవాణా సదుపాయాలు కల్పిస్తుండగా, ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాపులకు ఆ సౌకర్యం లేకపోవడంతో అదనపు భారం రైతుపైనే పడుతోంది. ఇక ఎమ్మార్పీ ధరలో దొరకాల్సిన యూరియా క్షేత్రస్థాయిలో మాత్రం రవాణా, లేబర్ చార్జీల పేరుతో అధిక ధరలకు విక్రయమవుతోంది. అలాగే పార దర్శకత పేరుతో ప్రవేశపెట్టిన ఆన్లైన్ యూరియా బుకింగ్ యాప్ కూడా రైతుకు శాపంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రైతుకీ స్మార్ట్ఫోన్ లేదా డిజిటల్ అవగాహన లేదు. యాప్ వినియోగం తెలియని రైతులు ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. అవగాహన ఉన్నవారే ముందుగా బుకింగ్ చేసుకుంటుండటంతో, మిగిలిన రైతులకు నిరాశే మిగులుతోంది. పైగా ప్రాంత పరిమితి లేకుండా బుకింగ్ జరగడం వల్ల స్థానిక రైతులకు యూరియా దక్కని పరిస్థితి ఏర్పడుతోంది. ---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..