
ముంబై, 11 ఫిబ్రవరి (హి.స.)
అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. గత వారం నుంచి బంగారం, వెండి ధరలు భారీగా దిగి వచ్చినప్పటికి ప్రస్తుతం భారీగా పెరుగుతోంది. అయితే ఫిబ్రవరి11న దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తులం పై కేవలం వంద రూపాయలు మాత్రమే పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,790 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,45,560 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు (24,22 క్యారెట్లలో ధరలు):
హైదరాబాద్‌లో రూ. 1,58,790, రూ. 1,45,560
విజయవాడలో రూ. 1,58,790, రూ. 1,45,560
ఢిల్లీలో రూ. 1,58,940, రూ. 1,45,710
ముంబైలో రూ. 1,58,790, రూ. 1,45,560
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV