
ముంబై, 12 ఫిబ్రవరి (హి.స.)గత నెలలో రికార్డ్ గరిష్ఠాలను తాకిన బంగారం, వెండి రేట్లు వెనక్కి దిగివచ్చిన సంగతి తెలిసిందే. అయితే, మళ్లీ ఇప్పుడు వరుసగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఆల్ టైమ్ హై స్థాయి కన్నా దాదాపు రూ.20 వేల తక్కువగానే ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కొనుగోలు చేసేందుకు ఇది సరైన సమయంగా చెబుతున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులతో బంగారంలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరుగుతోందని, పసిడి రేట్లు మరింత పెరగుతాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు దేశీయంగా ఈ ఫిబ్రవరి 19వ తేదీ నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలవుతోంది. పెళ్లి అంటేనే బంగారంతో ముడి పడి ఉంటుంది. కచ్చితంగా ఉండాల్సిందే. దీంతో జువెలరీ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. ఇలాంటి తరుణంలో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. మరి ఫిబ్రవరి 12వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు క్రితం రోజు స్వల్పంగా దిగివచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈరోజు మళ్లీ రేట్లు పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 46.43 డాలర్ల మేర పెరిగింది. దీంతో ఔన్స్ పసిడి మళ్లీ 5054 మార్క్ తాకింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 2.33 శాతం మేర పెరిగింది. దీంతో ఔన్స్ వెండి ధర 82.59 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
హైదరాబాద్‌లో బంగారం ధరలు
హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 12వ తేదీన సైతం బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై రూ. 750 మేర పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ. 1,46,300 వద్దకు ఎగబాకింది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు తులంపై రూ. 820 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల రేటు రూ.1,59,600 వద్దకు చేరుకుంది.
ఓవైపు బంగారం ధరలు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్న తరుణంలో వెండి స్వల్ప ఊరట కల్పించింది. వరుసగా రెండో రోజూ ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.3,00,000 మార్క్ వద్దే స్థిరంగా ట్రేడవుతోంది.
పైన పేర్కొన్న గోల్డ్, సిల్వర్ రేట్లు ఫిబ్రవరి 12వ తేదీ గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. అయితే, మధ్యాహ్నానికి రేట్లు మారిపోవచ్చు. కొనుగోలు చేసే వారు స్థానికంగా ఉండే ధరలను ముందుగా తెలుసుకోవడం మంచిది. గోల్డ్ జువెలరీ కొనుగోలు చేస్తే ధరల్లో ప్రాంతాలను బట్టి తేడా ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV