
ముంబై, 16 ఫిబ్రవరి (హి.స.)
గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన ‘రాజా సాబ్’ సినిమా ప్రేక్షకులను నిరుత్సాహానికి గురి చేసింది. మరోవైపు, ఈ సినిమాలో ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్‌పై నెగెటివ్ కామెంట్స్, ఫేస్-స్వాప్ ట్రోల్స్ వరదలా వచ్చాయి. “ప్రభాస్ కష్టపడటం లేదు, డూప్స్‌తో చేస్తున్నాడు” అని కొందరు ట్రోల్ చేశారు.
ఇప్పుడు ఆ ట్రోలర్స్ అందరికీ ఫ్యాన్స్ గట్టి సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో గుర్రపు స్వారీ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా గుర్రం నుంచి అదుపు తప్పి ప్రభాస్ కింద పడ్డారు. చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ వార్త తెలియగానే ఫ్యాన్స్ ఆందోళన చెందారు, కానీ ఇది చిన్న గాయమేనని, ప్రభాస్ త్వరలోనే కోలుకుని షూటింగ్ కొనసాగిస్తారని చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సంఘటనను చూపిస్తూ ఫ్యాన్స్ ట్రోలర్స్‌పై విరుచుకుపడుతున్నారు. “ప్రభాస్ డెడికేషన్ చూడండి. డూప్స్ లేకుండా రిస్కీ సీన్స్ చేస్తున్నాడు. గాయాలు వచ్చినా పట్టించుకోకుండా పని చేస్తున్నాడు. ట్రోలర్స్ ఇప్పుడు ఏం చెబుతారు?” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ప్రభాస్ ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి షూటింగ్‌లో చేరనున్నారు. ‘ఫౌజీ’తో పాటు ‘స్పిరిట్’ వంటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి, కొంత కాలం ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV