
హైదరాబాద్, 09 ఫిబ్రవరి (హి.స.)ఆర్థిక ఇబ్బందుల వల్ల గతంలో తనకు నచ్చకపోయినా కొన్ని సినిమాలు చేసినట్లు నటి నీనా గుప్తా (Neena Gupta) తెలిపారు.
‘‘నేను చేసిన కొన్ని పాత్రల విషయంలో బాధ పడ్డాను. నేను ప్రధాన పాత్రలో చేసిన కొన్ని సినిమాలు విడుదల కాకూడదని నేనే కోరుకున్నా. షూటింగ్ అయిపోయి ఇంటికి వెళ్లిన తర్వాత వీటిని ఎందుకు అంగీకరించానా అని బాధపడ్డా. అవి విడుదల కాకూడదని ప్రార్థించాను. ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నా. సెట్‌లో అవమానించారు. కొంతమంది దర్శకులు కారణం లేకుండా నన్ను అసభ్యపదాలతో తిట్టారు. ఆ చిత్రాలు ఇష్టంతో చేయలేదు. కేవలం నాకు డబ్బు అవసరం కాబట్టి చేశాను. ఒకవేళ ఆ సమయంలో వేరే చిత్రాల్లో అవకాశం వచ్చి ఉంటే నేను వీటిలో చేసేదాన్ని కాదు’’ అని నీనా గుప్తా తెలిపారు.
వెండితెర పైనే కాకుండా బుల్లితెర వేదిక గానూ ప్రేక్షకులను అలరించారు నటి నీనా గుప్తా. ‘ఇష్క్’, ‘ఎలోన్’, ‘ముల్క్’, ‘83’, ‘డయల్ 100’, ‘గుడ్‌బై’ వంటి చిత్రాల్లో నీనా కీలక పాత్రలు పోషించారు. సినిమాల్లో రాణిస్తోన్న తరుణంలోనే ఆమె ధారావాహికల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్‌సిరీస్‌లోనూ నటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్