కమల్‌హాసన్‌ ‘ఎంఎన్‌ఎం’ పార్టీకి టార్చిలైట్‌ గుర్తు
ఢిల్లీ,17 ,ఫిబ్రవరి (హి.స.) కమల్‌ హాసన్‌ మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) (Makkal Needhi Maiam) పార్టీకి భారత ఎన్నికల సంఘం టార్చిలైట్‌ గుర్తును కేటాయించింది. పుదుచ్చేరిలో ఎన్నికల కోసం ఈ గుర్తును కేటాయించినట్లు మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీం
Kamal


ఢిల్లీ,17 ,ఫిబ్రవరి (హి.స.) కమల్‌ హాసన్‌ మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) (Makkal Needhi Maiam) పార్టీకి భారత ఎన్నికల సంఘం టార్చిలైట్‌ గుర్తును కేటాయించింది. పుదుచ్చేరిలో ఎన్నికల కోసం ఈ గుర్తును కేటాయించినట్లు మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో అక్కడ అన్ని నియోజకవర్గాల్లో ఈ గుర్తుతో ఎంఎన్‌ఎం బరిలోకి దిగనుంది.

ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గుర్తింపుపొందని రాజకీయ పార్టీలు గుర్తు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల కమిషన్‌ ఇటీవల కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు.. దిల్లీలోని ప్రధాన ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో ఎంఎన్‌ఎం పార్టీ పది చిహ్నాలు ఉన్న జాబితాను అందించి, వాటిలో ఒక దానిని కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. తమిళనాడులో జరగనున్న ఎన్నికల్లో కూడా ఈ పార్టీ ఇదే గుర్తుతో పోటీ చేయనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande