
ఢిల్లీ,18 ,ఫిబ్రవరి (హి.స.)
భారత ఎన్నికల సంఘం (ECI) రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ (ఫిబ్రవరి 18, 2026)న విడుదల చేసింది. దీని ప్రకారం 10 రాష్ట్రాల్లో మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలు ఏప్రిల్ 2026లో వివిధ తేదీల్లో ఖాళీ అవుతున్నాయి. వీటిలో తెలంగాణ నుంచి 2 స్థానాలు (కేఆర్ సురేష్ రెడ్డి - BRS, అభిషేక్ మను సింఘ్వీ- INC) ఉన్నాయి. వీరి పదవీకాలం ఏప్రిల్ 9, 2026తో ముగుస్తుంది. వీటిని ద్వైవార్షిక ఎన్నికల భాగంగా ఇప్పుడు భర్తీ చేయనున్నారు.
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్.. కీలక తేదీలు:
నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 26, 2026
నామినేషన్ల దాఖలు చేసే చివరి తేదీ: మార్చి 5, 2026
నామినేషన్ల పరిశీలన: మార్చి 6, 2026
నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ: మార్చి 9, 2026
పోలింగ్: మార్చి 16, 2026 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)
ఓట్ల లెక్కింపు: మార్చి 16, 2026 సాయంత్రం 5 గంటలకు (పోలింగ్ ముగిసిన వెంటనే)
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ