డియర్‌ ఫ్రెండ్‌.. ముంబయిలో కలుద్దాం: మెక్రాన్‌కు ప్రధాని మోదీ స్వాగతం
ముంబయి,17 ,ఫిబ్రవరి (హి.స.) భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌ను ప్రధాని మోదీ స్వాగతించారు. ముంబయిలో కలుద్దామంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘భారత్‌కు స్వాగతం. ఈ పర్యటనలో భారత్‌-ఫ్రాన్స్ సంబంధాలను మరో స్థాయికి తీస
Prime Minister of India and French president


ముంబయి,17 ,ఫిబ్రవరి (హి.స.) భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌ను ప్రధాని మోదీ స్వాగతించారు. ముంబయిలో కలుద్దామంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

‘‘భారత్‌కు స్వాగతం. ఈ పర్యటనలో భారత్‌-ఫ్రాన్స్ సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ఎదురుచూస్తున్నాం. మన చర్చలు వివిధ రంగాల్లో రెండు దేశాల సహకారాన్ని బలోపేతం చేస్తాయని, ప్రపంచ పురోగతికి దోహదం చేస్తాయని విశ్వసిస్తున్నాను. ముంబయి, దిల్లీల్లో మీతో భేటీ అయ్యేందుకు ఎదురుచూస్తున్నాను’’ అని ఎక్స్‌లో మోదీ (PM Modi) రాసుకొచ్చారు. ఈ సందర్భంగా మెక్రాన్‌ను ఫ్రెండ్ అని సంబోధించారు. తన మూడు రోజుల భారత్ పర్యటన గురించి మెక్రాన్ చేసిన పోస్టుకు మోదీ ఈవిధంగా బదులిచ్చారు.

సోమవారం రాత్రి మెక్రాన్ ముంబయికి చేరుకున్నారు. ఆయనకు ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో మహారాష్ట్ర గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ స్వాగతం పలికారు. 19న దిల్లీలో జరిగే ‘ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌’లో మెక్రాన్‌ పాల్గొంటారు. భారత్‌కు 114 రఫేల్‌ యుద్ధవిమానాల సరఫరాకు మెక్రాన్‌ పర్యటన సమయంలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఈ కాంట్రాక్టు విలువ రూ.3.25 లక్షల కోట్లు. ఇది ఖరారైతే దేశ చరిత్రలో అతిపెద్ద రక్షణ ఒప్పందంగా నిలవనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande