మహిళలకు శుభవార్త.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధర.. వెండి మరో రూ. 15 వేలు డౌన్!
ముంబై, 17 ఫిబ్రవరి (హి.స.) భారతదేశంలో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇది కేవలం అలంకరణగానే కాకుండా పెట్టుబడికి కూడా గొప్ప సాధనంగా ఉంది. సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుంటుంది. అందుకే ప్రతి ఇంట్లో వారి స్థాయిని బట్టి ఎంతో కొంత బంగారం ఉంటుంద
Gold


ముంబై, 17 ఫిబ్రవరి (హి.స.)

భారతదేశంలో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇది కేవలం అలంకరణగానే కాకుండా పెట్టుబడికి కూడా గొప్ప సాధనంగా ఉంది. సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుంటుంది. అందుకే ప్రతి ఇంట్లో వారి స్థాయిని బట్టి ఎంతో కొంత బంగారం ఉంటుంది. ఇటీవల మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం చూస్తే భారతీయుల ఇళ్లలో ఏకంగా 34 వేల టన్నులకుపైగా బంగారం నిల్వలు పోగుపడి ఉన్నాయి. దీని విలువ చూస్తే భారతదేశ జీడీపీని మించి ఉందని తెలిసింది. 5 ట్రిలియన్ డాలర్లకుపైగా విలువ చేస్తుండగా.. భారత కరెన్సీలో చూస్తే ఇది రూ. 450 లక్షల కోట్లకుపైగా ఉందని చెప్పొచ్చు. అనిశ్చితి సమయంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా ఇది పనిచేస్తుంది. ఈ క్రమంలోనే ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు ఆర్బీఐ కూడా బంగారం నిల్వల్ని దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం కేంద్ర బ్యాంక్ దగ్గర 880 టన్నుల మేర బంగారం నిల్వలు ఉన్నాయి.

అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో బంగారం, వెండి ధరలు కొంత కాలంగా విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. గతేడాది భారీగా పెరిగి.. ఈ ఏడాది జనవరిలోనూ పుంజుకున్నాయి. కొద్ది రోజులుగా మళ్లీ హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతున్నాయి. కిందటి వారం కూడా శనివారం రోజు బంగారం ధర భారీగా పెరగ్గా.. ఇప్పుడు ఒక్కసారిగా దిగొచ్చింది.

దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల పసిడి ధర ఇవాళ రూ. 1200 తగ్గగా 10 గ్రాములకు రూ. 1,43,400 వద్ద ఉంది. అంతకుముందు శనివారం రూ. 1800 మేర పెరిగింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు మరోసారి రూ. 1310 తగ్గగా 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 1,56,440 వద్ద ట్రేడవుతోంది. బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా దిగొచ్చాయి. ఒక్కరోజులోనే ఏకంగా రూ. 15 వేలు తగ్గగా ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీకి రూ. 2.65 లక్షలకు దిగొచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande