బంగారం, వెండి కొనే వారికి బంపర్ గుడ్‌న్యూస్..
ముంబై, 18 ఫిబ్రవరి (హి.స.)వచ్చేది పెళ్లిళ్ల సీజన్.. పైగా మూఢం కూడా పూర్తైంది.. ఇప్పుడన్నీ మంచిరోజులే.. దీనికి తోడుగా బంగారం కూడా ప్రజల్ని ఊరిస్తోంది. ధరలు భారీగా తగ్గుముఖం పట్టడంతో పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు. గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు భారీగ
Gold


ముంబై, 18 ఫిబ్రవరి (హి.స.)వచ్చేది పెళ్లిళ్ల సీజన్.. పైగా మూఢం కూడా పూర్తైంది.. ఇప్పుడన్నీ మంచిరోజులే.. దీనికి తోడుగా బంగారం కూడా ప్రజల్ని ఊరిస్తోంది. ధరలు భారీగా తగ్గుముఖం పట్టడంతో పసిడి ప్రియులు పండగ చేసుకుంటున్నారు. గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు భారీగా తగ్గాయి. కొనే వారికి ఇదే సూపర్ టైం అంటున్నారు నిపుణులు. గత రెండు వారాలుగా బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఫిబ్రవరి 18 బుధవారం నాటికి పసిడి ధరలు మరింత తగ్గాయి. ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,54,190లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,41,340లకు పడిపోయింది.

– చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,56,210 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,43,190 గా ఉంది.

– ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,190, 22 క్యారెట్ల ధర రూ.1,41,340 గా ఉంది.

– ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,340 క్యారెట్ల ధర రూ.1,41,490 గా ఉంది.

– కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,190, 22 క్యారెట్ల ధర రూ.1,41,340 గా ఉంది.

– బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,190, 22 క్యారెట్ల ధర రూ.1,41,340 గా ఉంది.

– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,54,190, 22 క్యారెట్ల ధర రూ.1,41,340 గా ఉంది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande