
హైదరాబాద్, 23 ఫిబ్రవరి (హి.స.)
హైదరాబాద్ (Hyderabad) ప్రజలకు భారీ ఉపశమనం లభించింది. సోమవారం మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, ఎల్బీనగర్, కూకట్పల్లి, ఉప్పల్, మాసబ్యాంక్, అమీర్పేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం(Heavy Rain) పడింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లమీదకు వరదనీరు రావడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఉక్కపోతల నుంచి ప్రజలు కాస్త రిలాక్స్ అయ్యారు. మరోవైపు కరీంనగర్, నిజామాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక జోన్ల వారీగా చూసుకుంటే.. జోన్ 1లో ఉన్న యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చెదురుమదురు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు