ఆదిలాబాద్ ఎయిర్పోర్టుపై స్పష్టత ఇవ్వాలని రైతుల ఆందోళన
ఆదిలాబాద్, 23 ఫిబ్రవరి (హి.స.) విమానాశ్రయం ఏర్పాటులో భాగంగా భూసేకరణ విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సోమవారం రైతులు బైటాయించి నిరసన తెలిపారు. ఎకరాకు రూ.2 కోట్లు పరిహారం ( Compensation ) ఇవ్వాలని వారు ఈ సందర్భంగా న
రైతుల ఆందోళన


ఆదిలాబాద్, 23 ఫిబ్రవరి (హి.స.)

విమానాశ్రయం ఏర్పాటులో భాగంగా భూసేకరణ విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సోమవారం రైతులు బైటాయించి నిరసన తెలిపారు. ఎకరాకు రూ.2 కోట్లు పరిహారం ( Compensation ) ఇవ్వాలని వారు ఈ సందర్భంగా నినాదాలు చేశారు. విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్నామని బీజేపీ ఎంపీ నగశ్ ( MP Nagesh ), ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రకటించి మ్యాపు విడుదల చేశారని, దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

భూముల విషయంలో సర్వే నెంబర్లతో పాటు ఎన్ని ఎకరాలు తీసుకుంటారనే విషయం వెల్లడించాలని కోరారు. ప్రస్తుతం మార్కెట్ విలువ ఎకరాకు రూ.2 కోట్లు ఉందని, భూసేకరణ జరిపితే ప్రభుత్వం ఆ ధర చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.

తమ అవసరాల కోసం భూములను విక్రయించుకుందామంటే ఎయిర్పోర్టులో పోతున్నాయ ని ప్రచారం జరగడంతో ఎవరు కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. భూములు ఏ మేరకు పోతున్నాయి అనే విషయాన్ని కలెక్టర్ స్పష్టం చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande