క్రీడల్లో ప్రతిభ చూపిన పోలీసులకు ప్రోత్సాహకాలు : సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ
సూర్యాపేట, 23 ఫిబ్రవరి (హి.స.) ప్రతిభ చూపే పోలీస్ క్రీడాకారులకు సర్వీస్ లో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ లో ముందుండే అవకాశం ఉందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ 4వ రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీల్లో ప్రత
Sp


సూర్యాపేట, 23 ఫిబ్రవరి (హి.స.)

ప్రతిభ చూపే పోలీస్ క్రీడాకారులకు సర్వీస్ లో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ లో ముందుండే అవకాశం ఉందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ 4వ రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను అభినందించి మాట్లాడారు. భవిష్యత్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోలీస్ క్రీడల్లో ప్రతిభను కనబరిచి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడల్లో యాదాద్రి జోన్ కబడ్డీ పోటీలో మహిళా విభాగంలో ప్రథమ స్థానం పొందిన జట్టులో జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుళ్లు దీపిక, అనూష, శిరీష, దివ్యభారతి ఉన్నట్లు తెలిపారు. వాలీబాల్ పోటీలో మహిళా విభాగంలో తృతీయ స్థానం సాధించిన జట్టులో లావణ్య, ప్రియాంక, దివ్యభారతి, దీపిక, ప్రవల్లిక, అనూష, శిరీష ప్రాతినిధ్యం వహించారన్నారు. బాడ్మింటన్ మహిళా విభాగంలో తృతీయ స్థానం సాధించిన జట్టులో అనూష ఉన్నట్లు తెలిపారు.

పురుషుల విభాగంలో అథ్లెటిక్స్ లో ఆర్ఎస్ఐ మహేష్ 1,500 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్, ఐదు కిలోమీటర్ల పరుగు పందెంలో సిల్వర్ మెడల్, జావేల్లింగ్ త్రో లో కానిస్టేబుల్ స్వామి గోల్డ్ మెడల్ సాధించడం గర్వంగా ఉందన్నారు. అదేవిదంగా వీరిలో జాతీయస్థాయి పోలీసు క్రీడా పోటీలకు కబడ్డీ జట్టులో ప్రాతినిధ్యం వహించిన ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళా కానిస్టేబుల్ దీపిక, జిల్లా ఆర్మూడ్ పోలీసు విభాగానికి చెందిన మహిళా కానిస్టేబుళ్లు అనూష, శిరీష, వాలీబాల్ పోటీలకు జిల్లా ఆర్మూడ్ పోలీసు విభాగానికి చెందిన మహిళా కానిస్టేబుల్ లావణ్య, కోకో క్రీడా పోటీలకు జిల్లా ఆర్మూడ్ పోలీసు విభాగానికి చెందిన మహిళా కానిస్టేబుళ్లు దివ్యభారతి,అనూష ఎంపికైనట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, డీఎస్పీ నరసింహ చారి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ జానయ్య, పోలీస్ సంఘం అధ్యక్షుడు రామచంద్ర గౌడ్ పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande