
హైదరాబాద్, 24 ఫిబ్రవరి (హి.స.)
పాకిస్తాన్ మరో పోరుకు సిద్ధమైంది. టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో పడుతూ లేస్తూ సూపర్ 8 కి చేరుకున్న పాకిస్తాన్, ఇవాళ తన రెండో మ్యాచ్ ఆడబోతోంది. శ్రీలంక లోని క్యాండీ వేదికగా ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య సూపర్ 8 మ్యాచ్ జరగనుంది. ఇవాళ రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ షురూ కానుంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కంటే పాకిస్తాన్ గెలవడం చాలా ముఖ్యం. ఒకవేళ ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోతే, సెమీ ఫైనల్ ఛాన్సులు మరింత దూరం అవుతాయి. ఇప్పటికే మొదటి మ్యాచ్ సందర్భంగా వర్షం వల్ల పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కు వర్షం విలన్ గా మారింది. పాకిస్తాన్ జట్టుకు చావో రేవో దీంతో పాకిస్తాన్ కు ఒకే ఒక్క పాయింట్ దక్కింది. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది పాకిస్తాన్. అయితే నేటి ఇంగ్లాండ్ మ్యాచ్ లో గెలిస్తే పాకిస్తాన్ మొదటి స్థానానికి వెళుతుంది. ఒకవేళ ఓడిపోతే, పాయింట్ల పట్టికలో మరింత దిగజారుతుంది. అప్పుడు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ బరిలో ఉంటాయి. అందుకే నేటి మ్యాచ్ పాకిస్తాన్ కు చాలా కీలకంగా మారింది. కాస్త అజాగ్రత్తగా ఆడినా, మ్యాచ్ ఇంగ్లాండ్ వాళ్ళ చేతిలోకి వెళ్లిపోతుంది. కాగా ఇవాళ కూడా వర్షం ముప్పు ఉందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే, పాకిస్తాన్ మరింత ప్రమాదంలోకి వెళ్తుందని అంటున్నారు. ఖచ్చితంగా ఇవాళ మ్యాచ్ గెలిస్తేనే పాకిస్తాన్ కు అడ్వాంటేజ్ అంటున్నారు క్రీడా విశేషకులు.
మరి ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ ప్లేయర్లు ఎలా ఆడతారో చూడాలి. కాగా గ్రూప్ 2 లో మొదటి మ్యాచ్ గెలిచిన ఇంగ్లాండ్ 2 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. అటు పాకిస్తాన్ రెండో స్థానంలో ఉండగా న్యూజిలాండ్ మూడో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన శ్రీలంక చివరన ఉంది. అటు మొన్న గ్రూప్ 1లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిన భారత జట్టు పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. తన మిగిలిన రెండు మ్యాచ్ లలో భారత్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఈ నెలకొంది.---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు