అతి సుదీర్ఘ ప్రసంగం.. ఇరాన్కు ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్, 25 ఫిబ్రవరి (హి.స.) అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇవాళ రికార్డు క్రియేట్ చేశారు. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్లో ఉభయసభలను ఉద్దేశించి ఆయన అతి సుదీర్ఘ ప్రసంగం చేశారు. సుమారు గంటా 50 నిమిషాల పాటు ట్రంప్ మాట్లాడార
Trump warning


వాషింగ్టన్, 25 ఫిబ్రవరి (హి.స.)

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇవాళ రికార్డు క్రియేట్ చేశారు. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్లో ఉభయసభలను ఉద్దేశించి ఆయన అతి సుదీర్ఘ ప్రసంగం చేశారు. సుమారు గంటా 50 నిమిషాల పాటు ట్రంప్ మాట్లాడారు. తన ప్రసంగాల్లో ఇదే అతిసుదీర్ఘమైందిగా రికార్డుకెక్కింది. 2000 సంవత్సరంలో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ అత్యధికంగా 90 నిమిషాల పాటు మాట్లాడారు. ఇప్పుడు ఆ రికార్డును ట్రంప్ బ్రేక్ చేశారు. గత ఏడాది మార్చిలో కూడా ట్రంప్ సుమారు 100 నిమిషాల పాటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ట్రంప్ తన ప్రసంగంలో ఎక్కువగా ఆర్థిక ఎజెండా గురించి ప్రస్తావించారు.

ఇక ఇరాన్ అంశంలో వార్నింగ్ ఇచ్చారు. వాస్తవానికి ఆ సమ్యను దౌత్యం ద్వారా పరిష్కరించేందుకు ఇష్టపడుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. కానీ అణ్వాయుధాలను సమీకరిస్తున్న ఇరాన్ వైఖరిని మాత్రం ట్రంప్ ఖండించారు. న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ను ఇరాన్ విరమించుకోవాలన్నారు. అమెరికాను తాకే క్షిపణులను ఇరాన్ డెవలప్ చేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. కానీ దీనిపై ఆయన తన ప్రసంగంలో ఎటువంటి ఆధారాలను బయటపెట్టలేదు. యురోప్కు ప్రమాదంగా మారే కొన్ని మిస్సైల్స్ను ఇప్పటికే ఇరాన్ డెవలప్ చేసిందన్నారు. ఇతర దేశాల్లో ఉన్న అమెరికా బేస్లను కూడా టార్గెట్ చేసే రేంజ్ ఇరాన్కు ఉందన్నారు. ఇక అమెరికా భూభాగానికి చేరుకునే స్థాయికి తగ్గ క్షిపణులను కూడా ఇరాన్ అభివృద్ధి చేస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande