
Andhra Pradesh, 27 ఫిబ్రవరి (హి.స.)దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఎట్టకేలకు దిగివచ్చాయి. పసిడి ధరల పరుగుకు బ్రేక్ పడింది. వారం రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గాయి. దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న క్రమంలో బంగారం కొనుగోళ్లు భారీగా జరుగుతున్నాయి. అధిక ధరల వద్ద కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్న వారందరికీ ఇప్పుడు ఊరట లభించిందని చెప్పవచ్చు. అలాగే ధరలు తగ్గితే కొనుగోలు చేద్దామని ఎదురుచూస్తున్న వారికి ఇదే మంచి అవకాశం. మళ్లీ పసిడి రేట్లు పెరగడం మొదలు పెట్టక ముందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, అమెరికా సుంకాలు, దేశాల మధ్య యుద్ధాల వంటి చాలా కారణాలు బంగారం ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. అయితే, ఈరోజు అమెరికన్ డాలర్ విలువ బలహీనపడడంతో ధరలు స్వల్పంగా తగ్గాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 27వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ ఔన్సు రేటు 33 డాలర్లకు పైగా తగ్గింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు 5274 డాలర్ల వద్దకు తగ్గి ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్ ధర 3 శాతానికి పైగా తగ్గింది. దీంతో ఈరోజు ఔన్స్ రేటు 2.72 డాలర్లు తగ్గి 88 డాలర్ల స్థాయికి దిగివచ్చింది.
హైదరాబాద్లో బంగారం ధరలు
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వారం రోజుల తర్వాత తగ్గాయి. కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.870 మేర తగ్గింది. దీంతో తులం రేటు రూ.1,61,020 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారు రేటు 10 గ్రాముల బంగారం రేటు రూ. 800 మేర తగ్గింది. దీంతో తులం రేటు రూ.1,47,600 స్థాయికి తగ్గింది.
స్థిరంగా వెండి రేటు తగ్గింది
బంగారం ధరతో పాటు వెండి రేటు సైతం మారుతోంది. క్రితం రోజు రూ.5000 మేర దిగివచ్చిన వెండి ధర ఈరోజు అదే ధర వద్ద స్థిరంగా ట్రేడవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.2,95,000 వద్ద ట్రేడవుతోంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. అయితే, మధ్యాహ్నం వరకు బులియన్ మార్కెట్లో ధరలు మారిపోతుంటాయి. కొనుగోలు చేసే ముందు స్థానికంగా ఉండే రేట్లు తెలుసుకోవడం మంచిది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV