మళ్లీ అదే జోరు.. బంగారం, వెండి ఉరుకులు.. పరుగులు.. ఏపీ, తెలంగాణలో ధరలు ఇవే
ముంబై, 24 ఫిబ్రవరి (హి.స.)బంగారం, వెండి ధరలు మళ్లీ ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. మళ్లీ అదే జోరు కొనసాగిస్తున్నాయి. ఇటీవల రూ.2 లక్షల వరకు వెళ్లిన తులం బంగారం ధర.. ఇప్పుడు జోరందుకుంటోంది. నేనేందుకు తగ్గాలే అన్నట్లు పరుగులు పెడుతోంది. నిన్న ఒక్క రోజు
Gold


ముంబై, 24 ఫిబ్రవరి (హి.స.)బంగారం, వెండి ధరలు మళ్లీ ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. మళ్లీ అదే జోరు కొనసాగిస్తున్నాయి. ఇటీవల రూ.2 లక్షల వరకు వెళ్లిన తులం బంగారం ధర.. ఇప్పుడు జోరందుకుంటోంది. నేనేందుకు తగ్గాలే అన్నట్లు పరుగులు పెడుతోంది. నిన్న ఒక్క రోజు 2 వేల రూపాయలకుపైగా ఎగబాకింది. అలాగే వెండి వెండి ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. కిలో వెండి ధర 4 లక్షలకు వెళ్లగా ఇప్పుడు 1 లక్ష రూపాయలకుపైగా దిగి వచ్చింది. అయితే మళ్లీ రెండు రోజుల నుంచి పరుగులు పెడుతోంది. నిన్న ఒక్క రోజే వెండి ధర రూ25 వేల వరకు పెరిగింది.

ఇక తాజాగా ఫిబ్రవరి 24వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,360 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,47,910 ఉంది. ఇక వెండి కిలోపై 3 లక్షల 100 రూపాయల వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్:

24 క్యారెట్ల ధర రూ.1,61,360

22 క్యారెట్ల ధర రూ.1,47,910

ముంబై:

24 క్యారెట్ల ధర రూ.1,61,360

22 క్యారెట్ల ధర రూ.1,47,910

చెన్నై:

24 క్యారెట్ల ధర రూ.1,62,120

22 క్యారెట్ల ధర రూ.1,48,610

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande