
ముంబై, 23 ఫిబ్రవరి (హి.స.)
అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం 5145 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ కారణంగానే బంగారం ధర దేశీయ మార్కెట్లో కూడా భారీగా పెరుగుతున్నట్లు గమనించవచ్చు. బంగారం ధర పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్న.. ప్రతి రోజు బంగారం, వెండి ధరలు కీలకంగా మారుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెండింతలు పెరుగుతోంది. నేడు ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం బంగారం, వెండి ధరలు అతి స్వల్పంగా తగ్గినప్పటికీ ఇంకా భారీగానే ఉన్నాయి. తులం ధర రూ.1.60 లక్షల చేరువలో ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,59,270 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,45,990 పలుకుతోంది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర అతి స్వల్పంగా తగ్గింది. అంటే కేవలం పది రూపాయలు మాత్రమే తగ్గింది. అయితే దేశంలో వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరల్లో తేడా ఉండవచ్చు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల జీఎస్టీ, ఇతర ఛార్జీల కారణంగా మార్పులు ఉంటాయని గుర్తించుకోండి.
ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,270 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,45,990 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,270 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,990 వద్ద ఉంది.
హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,270 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,990 వద్ద ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,270 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,990 వద్ద ఉంది.
ఇవి కూడా చదవండి
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,140 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,790 వద్ద ఉంది.
ఇక వెండి విషయానికొస్తే కిలో ధర రూ.2,74,900 వద్ద కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Investment: రూ.3 లక్షలు డిపాజిట్ చేస్తే కళ్లు చెదిరే లాభం.. పొదుపు చేయాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్..!
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV