
నాగర్ కర్నూల్, 28 ఫిబ్రవరి (హి.స.)
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్
పార్టీ బలోపేతం కొరకై గత కొన్ని రోజుల నుండి వికారాబాద్లో నిర్వహిస్తున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా శనివారం వికారాబాద్ జిల్లా మదనపల్లి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో కూలిగా మారిన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సేవా గ్రామ్లో భాగంగా ఉపాధి హామీ చట్టం తీరు, ఉపాధి హామీ కూలీల చట్టం ద్వారా పొందుతున్న లబ్ధిని కూలీలను అడిగి తెలుసుకున్నారు. పనులలో పారపట్టి తట్ట మోసి ఉపాధి హామీ పనులలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించడమే కాకుండా, గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. అలాగే కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు