గ్రామీణ క్రికెట్ క్రీడాకారులకు ఇది గొప్ప అవకాశం: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ స్టేడియాల ఏర్పాటు మంచి పరిణామం అని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మల్కాజిరి మున్సిపల్ కార్పొరేషన్ పోచారం డివిజన్ పరిధిలోని ప్రతాప సింగారంలో స్పాట్లైట్ క్రికెట్ అకాడమీ ఏర్పాటుచ
Minister Vivek


హైదరాబాద్, 28 ఫిబ్రవరి (హి.స.) గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ స్టేడియాల

ఏర్పాటు మంచి పరిణామం అని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మల్కాజిరి మున్సిపల్ కార్పొరేషన్ పోచారం డివిజన్ పరిధిలోని ప్రతాప సింగారంలో స్పాట్లైట్ క్రికెట్ అకాడమీ ఏర్పాటుచేసిన క్రికెట్ స్టేడియాన్ని శనివారం మంత్రి వివేక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరానికి అతి స్వల్ప దూరంలో అన్ని ఆధునిక సౌకర్యాలతో క్రీడాకారుల కోసం క్రికెట్ స్టేడియాన్ని తయారుచేసిన స్పాట్లైట్ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు నాగరాజు, లక్ష్మణులను అభినందించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల అభివృద్ధి కోసం తన వంతు ప్రోత్సాహాన్ని అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమర్నాథ్, మేడ్చల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ శరత్ చంద్రారెడ్డి, బసవరాజ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande