
హైదరాబాద్, 03 ఫిబ్రవరి (హి.స.)
సెల్‌ఫోన్‌ను దొంగిలించి యూపీఐ ద్వారా నగదును కొల్లగొడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సూరారం ఎస్‌హెచ్‌ఓ సుధీర్ కృష్ణ తెలిపారు. నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్ మొబైల్ ఫోన్‌ను దొంగిలించి, డిజిటల్ పేమెంట్స్ ద్వారా భారీగా నగదును అక్రమంగా కాజేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు.
జనవరి 7వ తేదీ తెల్లవారుజామున హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి మొబైల్ ఫోన్ చోరీకి గురైందని, ఆ మొబైల్‌లోని యూపీఐ యాప్ ద్వారా బాధితుడి ఖాతా నుంచి సుమారు రూ.8,00,000/-లను నిందితుడు అక్రమంగా మళ్లించినట్లు తెలిపారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు సూరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా సూరారం క్రైమ్స్ టీమ్ సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు బ్యాంక్ లావాదేవీలను సాంకేతిక ఆధారాలతో విశ్లేషించి నిందితుడిని గుర్తించినట్లు తెలిపారు. మెదక్ జిల్లా కవిడిపల్లి గ్రామానికి చెందిన బూరడ ఆది నారాయణ (34)గా నిందితుడిని నిర్ధారించి అతడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నిందితుడి వద్ద నుంచి దొంగిలించబడిన ఒక మొబైల్ ఫోన్‌తో పాటు రూ.6,73,000/- నగదును స్వాధీనం చేసుకున్నామని, రికవరీ చేసిన మొత్తం సొత్తు విలువ సుమారు రూ.7,00,000/- వరకు ఉంటుందని వివరించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించి తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
కేసును తక్కువ సమయంలోనే ఛేదించిన సూరారం క్రైమ్ టీమ్ సిబ్బందిని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు అభినందించారు. ప్రజలు ఆసుపత్రులు మరియు రద్దీగా ఉండే ప్రాంతాల్లో తమ విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లకు, బ్యాంకింగ్ యాప్స్‌కు తప్పనిసరిగా సెక్యూరిటీ లాక్‌లు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు