
హైదరాబాద్, 03 ఫిబ్రవరి (హి.స.)మేడారం మహాజాతర అత్యంత వైభవంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముగియడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. గత జాతరల కంటే మెరుగైన ఏర్పాట్లు చేశామని, అమ్మవార్ల ఆశీస్సులతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారని ఆమె కొనియాడారు. ఈ ఏడాది జాతర అంచనాలకు మించి జరిగిందని మంత్రి తెలిపారు. “క్లాస్, మాస్ అనే తేడా లేకుండా హైక్లాస్ పీపుల్ కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. సుమారు రెండున్నర కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నాం” అని ఆమె పేర్కొన్నారు. మరో ఒకటి రెండు రోజుల్లో ‘తిరుగు జాతర’ నిర్వహణతో ఈ వేడుకలు పూర్తిస్థాయిలో ముగుస్తాయని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు