
హైదరాబాద్, 03 ఫిబ్రవరి (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల విదేశీ పర్యటన పూర్తిగా అధికారికంగా, ముందుగా షెడ్యూల్ చేసిన ప్రోటోకాల్ ప్రకారమే జరిగాయని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. సీఎం ఫారిన్ టూర్ మిస్టరీగా సాగిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఫ్యాక్ట్ చెక్ (Telangana Fact Check) టీమ్ ఖండించింది. ఈ మేరకు ఇవాళ ఎక్స్ వేదికగా అధికారిక వివరణ ఇచ్చింది. సీఎం పర్యటనకు సంబంధించి సోషల్ మీడియాలో కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారుని ఇది కేవలం ప్రజలను తప్పుదారి పట్టించడానికి చేసిన ప్రయత్నమేనని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి ప్రయాణానికి సంబంధించిన షెడ్యూల్, ఆయన పర్యటన ప్రణాళికను ఆయా ప్రదేశాలలో ముందుగానే షెడ్యూల్ చేసిన కార్యక్రమాలకు అనుగుణంగా అధికారికంగా సమన్వయం చేయడం జరిగిందని తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు