ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం.. కడియం శ్రీహరికి మరోసారి స్పీకర్ నోటీసులు
హైదరాబాద్, 03 ఫిబ్రవరి (హి.స.) ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్పై రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో విచారణ జరగనుంది. ఈ మేరకు విచారణ షెడ్యూల్ను స్పీకర్ ప్రసాద్ కుమార
పార్టీ ఫిరాయింపు


హైదరాబాద్, 03 ఫిబ్రవరి (హి.స.)

ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో

కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్పై రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో విచారణ జరగనుంది. ఈ మేరకు విచారణ షెడ్యూల్ను స్పీకర్ ప్రసాద్ కుమార్, కడియం శ్రీహరికి మరోసారి పంపిన నోటీసులలో స్పష్టంగా పేర్కొన్నారు. విచారణకు హాజరుకావాలని అసెంబ్లీ సెక్రటరీ నుంచి కడియంకు నోటీసులు కూడా అయ్యాయి. అదేవిధంగా, అనర్హత పిటిషన్ దాఖలు చేసిన కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande