
మిర్యాలగూడ, 03 ఫిబ్రవరి (హి.స.)
విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్లను కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సురేష్, మదార్లు విధి నిర్వహణలో భాగంగా రేపు ముఖ్యమంత్రి సభనిర్వహించే స్థలానికి వెళ్తుండగా మిర్యాలగూడ పట్టణంలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలో వెనుక నుంచి వస్తున్న కంటైనర్ బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు