బంగారం ధరలపై కీలక అప్డేట్.. మరోసారి తగ్గిన ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
ముంబై, 03 ఫిబ్రవరి (హి.స.)బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. గత కొద్దిరోజులుగా క్రాష్ అవుతూ మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. గత నాలుగైదు రోజులుగా గోల్డ్‌తో పాటు సిల్వర్ ధరలు కూడా భారీ స్థాయిలో కుప్పకూలుతున్నాయి. బడ్జెట్ ప్రకటన తర్వాత పడిసి ధ
Gold


ముంబై, 03 ఫిబ్రవరి (హి.స.)బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. గత కొద్దిరోజులుగా క్రాష్ అవుతూ మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. గత నాలుగైదు రోజులుగా గోల్డ్‌తో పాటు సిల్వర్ ధరలు కూడా భారీ స్థాయిలో కుప్పకూలుతున్నాయి. బడ్జెట్ ప్రకటన తర్వాత పడిసి ధరలు మరింతగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ సంక్షోభాలు, ఆర్ధిక అనిశ్చితి, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్‌కు త్వరలో కొత్త ఛైర్మన్‌ను ప్రకటించనున్నారనే సంకేతాలు గోల్డ్ ధరలపై ప్రభావితం చూపిస్తున్నాయి. బంగారం ధరలు తగ్గుతుండటం కొనుగోలుదారులకు ఊరటనిస్తుండగా.. డిజిటల్‌గా పెట్టుబడులు పెట్టినవారు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ధరలు పెరిగితే లాభాలను బుక్ చేసుకోవాలని చూస్తున్నారు. మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధరలు ప్రాంతాల వారీగా..

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇవాళ రూ.1,53,170 వద్ద కొనసాగుతోండగా.. సోమవారం ఈ ధర రూ.1,53,170 వద్ద స్ధిరపడింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,40,390 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,310 వద్ద కొనసాగుతుండగా.. సోమవారం రూ.1,53,320 వద్ద స్ధిరపడింది. 22 క్యారెట్ల రేటు రూ.1,40,540గా ఉంది. సోమవారం రూ.1,40,550 వద్ద స్ధిరపడింది

వెండి ధరలు చూస్తే..

-ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,99,900 వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది. సోమవారం ఈ ధర రూ.3 లక్షలు వద్ద స్ధిరపడింది.

-ఇక హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.2,99,900 వద్ద కొనసాగుతోంది.

-చెన్నైలో కేజీ వెండి రేటు రూ.2,99,900 వద్ద కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande