ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026-27 బడ్జెట్ కసరత్తు
అమరావతి, 04 ఫిబ్రవరి (హి.స.) అమరావతి,: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నేతృత్వంలో ఆ శాఖ అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈనెల 14వ తేదీన 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026-27 బడ్జెట్ కసరత్తు


అమరావతి, 04 ఫిబ్రవరి (హి.స.)

అమరావతి,: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నేతృత్వంలో ఆ శాఖ అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈనెల 14వ తేదీన 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆర్థిక మంత్రి వరుసగా ప్రీ-బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఐదు శాఖలకు చెందిన మంత్రులతో సమావేశాలు పూర్తయ్యాయి. మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవి కుమార్, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, అనితలతో వరుస సమావేశాలు జరిపారు. ఈ సమావేశాల్లో ఆయా శాఖలకు నిధుల కేటాయింపులు, ప్రాధాన్యతలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. వివిధ శాఖల మంత్రులు తమ ప్రతిపాదనలను ఆర్థిక మంత్రికి సమర్పించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande