దువ్వాడ రైల్వే.స్టేషన్.లో ఓ చీఫ్.ఇంజనీర్ ఆత్మహత్య
అమరావతి, 04 ఫిబ్రవరి (హి.స.) గాజువాక: విశాఖ జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఓ ప్రైవేటు కంపెనీలో చీఫ్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న హర్షవర్ధన్‌ (36).. విజయవాడ వైపు వెళ్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ కింద పడి బలవన్మరణానిక
దువ్వాడ రైల్వే.స్టేషన్.లో ఓ చీఫ్.ఇంజనీర్ ఆత్మహత్య


అమరావతి, 04 ఫిబ్రవరి (హి.స.)

గాజువాక: విశాఖ జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఓ ప్రైవేటు కంపెనీలో చీఫ్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న హర్షవర్ధన్‌ (36).. విజయవాడ వైపు వెళ్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది.

హర్షవర్ధన్‌ సూసైడ్‌ నోట్‌ రాసి బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. దీంతో ఆయన అదృశ్యమైనట్లు న్యూపోర్టు పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో దువ్వాడ రైల్వేస్టేషన్‌లో హర్షవర్ధన్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande