
అమరావతి, 04 ఫిబ్రవరి (హి.స.)
మచిలీపట్నం: కృష్ణా జిల్లాలో దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. నిందితుల నుంచి సుమారు రూ.6 లక్షల నకిలీ నోట్లు, ప్రింటింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృత్తివెన్ను మండలం సంగముడిలోని ఓ వైన్ షాప్ వద్దకు వచ్చిన పలువురు దొంగనోట్లు ఇచ్చినట్లు నిర్వాహకులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వైన్ షాపు సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ