మంత్రులందరూ జిల్లాలకు వెళ్లాలి అని సీఎం రేవంత్ ఆదేశం
మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి మంత్రులను ఉద్దేశించి సీఎం…
మంత్రులందరూ జిల్లాలకు వెళ్లాలి అని సీఎం రేవంత్ ఆదేశం


హైదరాబాద్, 04 ఫిబ్రవరి (హి.స.)

సర్వే లలో వెనకబడిన మున్సిపాలిటీ లను విశ్లేషించిన సీఎం

జిల్లా పర్యటన వివరాలు తెలుసుకున్న సీఎం

ఎప్పటికప్పుడు ఇంచార్జ్ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశం

రోజు వారిగా రిపోర్ట్ తనకు అందించాలని ఆదేశం అసంతృప్తి నేతలన బుజ్జగించాలన్న సీఎం

సమిష్టిగా అందరం పని చేయాల్సిందే

ఓట్లు చీలకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక నేతలదే

కచ్చితంగా అన్ని స్థానాలు గెలవాల్సిందే

పాత–కొత్త నేతల సమన్వయంతో పనిచేయాలి

గెలుపు బాధ్యత ఆయా పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జిదేనని స్పష్టంచేసిన సీఎం, పీసీసీ చీఫ్

ఎన్నికలు పూర్తయ్యే వరకు అందరూ తమ ఇంచార్జి నియోజకవర్గాల్లోనే ఉండి మానిటరింగ్ చేయాలి

ఏమైనా సమస్యలుంటే ఎప్పటికప్పుడు పీసీసీ చీఫ్‌, వార్‌రూమ్‌ దృష్టికి తీసుకురావాలి

హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి నల్గొండ జిల్లా మిర్యాలగూడకు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ..

సీఎంతో పాటు మిర్యాలగూడకు బయలుదేరిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ రఘువీర్ రెడ్డి.

మిర్యాలగూడ మండలం గూడూరులో రూ.200 కోట్లతో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేయనున్న సీఎం..

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభకు హాజరు కానున్న సీఎం

సభలో మహిళా స్వయం సహాయక సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి..

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande