
హైదరాబాద్, 04 ఫిబ్రవరి (హి.స.)
పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్ష నేతరాహుల్ గాంధీకి ఊహించని షాక్ తగిలింది. కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు ఆయన గురించి చేసిన వ్యాఖ్యలు షాక్ ఇచ్చారు. లోక్సభలోని మకర్ ద్వార్ వద్ద నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ ఎంపీల మీదుగా బిట్టు వెళ్తున్న సమయంలో, రాహుల్ గాంధీ ఆయనను ఉద్దేశించి ఒక ద్రోహి ఇటుగా వెళ్తున్నాడు.. ముఖం చూడండి.. హలో ఫ్రెండ్, నువ్వు మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తావు అంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలపై బిట్టు అత్యంత తీవ్రంగా స్పందించారు.
రాహుల్కు బిట్టు స్ట్రాంగ్ కౌంటర్
పార్లమెంట్ ఎంట్రీ మెట్లపై అడ్డుగా కుర్చున్న వారు.. ఎంపీ బిట్టూ అటుగా వెళ్తున్న సమయంలో ఆయనను ఉద్దేశించి ఒక ద్రోహి ఇటుగా వెళ్తున్నాడు.. ముఖం చూడండి అంటూ రాహుల్ గాంధీ సెటైర్లు వేశాడు. ఈ వ్యాఖ్యలు బిట్టు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఆయనకు రాహుల్ గాంధీ కరచాలనం చేసేందుకు చేయి చాచగా, బిట్టు దానిని తిరస్కరించారు. మీరు దేశ ద్రోహులు, దేశ శత్రువులు, రోజూ సైన్యంపై, దేశంపై వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులతో నేను కరచాలనం చేయను అని ముఖం మీదే చెప్పేశాడు. దీంతో ఒక్కసారిగా అక్కడివారంతా షాక్ అయ్యారు. అలాగే రాహుల్ గాంధీ అతనిపై మండిపడ్డాడు. అనంతరం రవ్నీత్ సింగ్ బిట్టు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఇది జరిగిన కొద్ది సేపటికి బిట్టు మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ కుటుంబంపై సంచలన ఆరోపణలను చేశాడు. గాంధీ కుటుంబం పంజాబ్ను తగలబెట్టిందని, స్వర్ణ దేవాలయంపై బుల్లెట్లు కురిపించి వేలాది మంది సిక్కులను, పంజాబీలను బలి తీసుకుందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..