
హైదరాబాద్, 06 ఫిబ్రవరి (హి.స.) దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా
తుడిచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విధించుకున్న మార్చి 31 గడువు సమీపిస్తున్న తరుణంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shar) ఛత్తీస్గఢ్ (Chhattisgarh) మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు సాగే ఈ పర్యటనలో ప్రధానంగా నక్సల్స్ నిర్మూలనకు సంబంధించి 'ఫైనల్ స్ట్రాటజీ' (Final strategy)ని ఆయన ఖరారు చేయనున్నారు. ఈ మేరకు రేపు సాయంత్రం ఆయన రాయ్పూర్ (Raipur) చేరుకుంటారు. మొదట రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సంస్థలతో ప్రాథమిక సమీక్ష నిర్వహించనున్నారు.
హై-లెవల్ సెక్యూరిటీ మీటింగ్..
మావోయిస్టుల ఏరివేతలో భాగంగా ఫిబ్రవరి 8న ఆయా రాష్ట్రాల్లోని తాజా పరిస్థితిపై రాయ్పూర్లో హై-లెవల్ సెక్యూరిటీ మీటింగ్ (High-Level Security Meeting)ను ఏర్పాటు చేశారు. es సమావేశంలో అమిత్ షాతో పాటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల ఉన్నతాధికారులు, సీఏపీఎఫ్ (CAPF), నిఘా విభాగాల ప్రతినిధులు పాల్గొంటారు. భేటీలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఆపరేషన్ల పురోగతిని సమీక్షించి, ఫైనల్ రోడ్ మ్యాప్ను ఖరారు చేయన్నట్లుగా తెలుస్తోంది. అయితే, అసలు ఆ హై-లెవల్ మీటింగ్లో తీసుకునే కీలక నిర్ణయాలు ఏంటి..? ఏం నెక్స్ట్ ఏం చేయబతున్నారే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఫిబ్రవరి 9న బస్తర్ జిల్లాలోని జగదల్పూర్లో జరిగే 'బస్తర్ పందుమ్ మహోత్సవం 2026'ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం బస్తర్లోని అంతర్గత ప్రాంతాలను సందర్శించి, క్షేత్రస్థాయిలో ఉన్న జవాన్లతో అమిత్ షా నేరుగా మాట్లాడే అవకాశం ఉంది.కీలక వ్యూహాలు, కేంద్ర హోంశాఖ గణాంకాలు
ఆపరేషన్ కగార్ (Operation Kagar)లో భాగంగా కేంద్ర హోంశాఖ 2019 నుంచి ఇప్పటి వరకు 229 కొత్త బేస్లను ఏర్పాటు చేయడం గేమ్ ఛేంజర్గా మారింది. ఇందులో ఈ ఏడాది ప్రారంభంలోనే 59 బేస్లను నిర్మించి మావోయిస్టుల స్థావరాలపై పట్టు సాధించారు. 2010లో హింసాత్మక ఘటనలు 1,936 ఉండగా.. 2025 నాటికి అవి 234కు తగ్గాయి. అదేవిధంగా పౌరులు, భద్రతా దళాల మరణాలు 90 శాతం వరకు తగ్గాయి. . ఈ క్రమంలోనే అమిత్ షా పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మావోయిస్టుల వ్యతిరేక పోరులో కేంద్ర ప్రభుత్వం చివరి అడుగు వేయబోతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..