
హైదరాబాద్, 06 ఫిబ్రవరి (హి.స.)నవీన్ పొలిశెట్టి హీరోగా దర్శకుడు మారి తెరకెక్కించిన చిత్రం 'అనగనగా ఒక రాజు'. ఇందులో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'అనగనగా ఒక రాజు' మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్ కానుందని యాప్‌లో ఆ ఓటీటీ సంస్థ పేర్కొంది. నవీన్ పొలిశెట్టి కామెడి పంచ్‌లకు ఫిదా అయిన ప్రేక్షకులు మరోసారి ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫిబ్రవరి 13న ఓటీటీలోకి ఈ మూవీ రానుందంటూ పెద్ద ఎత్తున సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, అంతకంటే ముందుగానే ఈ మూవీ ఓటీటీలోకి రానుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్