
ముంబై, 06 ఫిబ్రవరి (హి.స.)కొన్నాళ్లుగా అందని ద్రాక్షగా మారిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు అమాంతం దిగి వస్తున్నాయి. శుక్రవారం ఉదయం కొన్ని గంటలల్లోని వెండి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం 6గంటలకు మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,99,900 ఉండగా 10 గంటలకు ఈ ధర రూ.20వేలు తగ్గి రూ. 2,80,000 కొనసాగుతుంది.
ఇక హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల చూసుకుంటే ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,52,350గా ఉండగా ఉదయం 6 గంటలకు ఈ ధర రూ.1,54,410గా ఉంది. అంటే కేవలం 4గంటల్లోనే బంగారం ధర రూ.2వేలకుపైగా దిగొచ్చింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,39,650గా ఉండగా ఉదయం 6 గంటలకు ఈ ధర రూ. 1,41,550 వద్ద కొనసాగింది.
ఇక విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు ప్రస్తుతం రూ.1,52,350గా వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,39,650గా ఉంది. ఇక దేశంలో ప్రధాన నగరాలైన ముంబై, కోల్‌కతా, పూణె, బెంగళూరు, కెరళలో సైతం ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV