మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు… నేడు తులం ధర ఎంత ఉందో తెలుసా?
ముంబై, 07 ఫిబ్రవరి (హి.స.) ఫిబ్రవరి 7 శనివారం విజయవాడ, హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రపంచ మార్కెట్లో లాభాల బుకింగ్, బలమైన డాలర్, RBI విధానం ప్రభావం దేశీయ స్థాయిలో బులియన్ మార్కెట్‌ను ఒత్తిడిలో ఉంచాయి. ఇలాంటి పరిస్థితుల్లో భ
Gold


ముంబై, 07 ఫిబ్రవరి (హి.స.)

ఫిబ్రవరి 7 శనివారం విజయవాడ, హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రపంచ మార్కెట్లో లాభాల బుకింగ్, బలమైన డాలర్, RBI విధానం ప్రభావం దేశీయ స్థాయిలో బులియన్ మార్కెట్‌ను ఒత్తిడిలో ఉంచాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ఒక గ్రాము రూ. 15,370లు ఉండగా, అలాగే, ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రూ.14,089లకు చేరింది. అదే 18 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రూ.11,527ల ధర పలుకుతోంది. అయితే, దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు పరిశీలించినట్టయితే...

శనివారం ఉదయం 10గంటల లోపు దేశంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,700, 22 క్యారెట్ల ధర రూ.1,40,890 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,74,900గా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,850 క్యారెట్ల ధర రూ.1,41,040 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,74,900గా ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,700, 22 క్యారెట్ల ధర రూ.1,40,890 గా ఉంది. వెండి కిలో ధర రూ.వెండి కిలో ధర రూ.2,79,900గా ఉంది.

విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,700, 22 క్యారెట్ల ధర రూ.1,40,890 గా ఉంది. వెండి కిలో ధర రూ.వెండి కిలో ధర రూ.2,79,900గా ఉంది.

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గడంతో బంగారం, వెండి ధరలు తగ్గాయి. రెండు దేశాలు అణు ఒప్పందంపై చర్చలు ప్రారంభించనున్నాయి. శుక్రవారం జరిగిన తొలి చర్చలు డాలర్ డిమాండ్‌ను పెంచాయి. సురక్షితమైన పెట్టుబడులుగా బంగారం, వెండికి డిమాండ్‌ను తగ్గించాయి. ఈరోజు మార్కెట్లో ధరలు ఒత్తిడిలో ఉన్నాయి. పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలలోపు అందిన సమాచారం మేరకు మాత్రమే. ధరలు ప్రతి క్షణం మారవచ్చు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande