రాజకీయ విమర్శలు మానుకొని.. అభివృద్ధిపై దృష్టి పెట్టండి: బండి సంజయ్
కేంద్ర మంత్రి బండి సంజయ్
Bandi sanjay


హైదరాబాద్, 01 మార్చి (హి.స.)కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా మెజార్టీ సీట్లు గెలిచినా, మేయర్ పదవి రాకుండా అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇప్పటికైనా రాజకీయ విమర్శలు మానుకొని, కేంద్రం, రాష్ట్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి జరిగేలా చూడాలన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం విజయనగర్ కాలనీలో ఆదివారం బండి సంజయ్ పర్యటించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇటీవల ఏకగ్రీవమైన విజయనగర్ కాలనీ భాజపా గ్రామ సర్పంచ్ సాదుల అమూల్యకు రూ.10 లక్షల నిధులు అందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో భాజపా బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవ సర్పంచ్లుగా గెలిపిస్తే.. ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు ఇస్తానని చెప్పినట్లు గుర్తు చేశారు.

ఎంపీ నిధుల కింద తనకు వచ్చే రూ.5 కోట్లతో తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 5 జిల్లాల్లో అన్ని గ్రామాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పారు. తన నియోజకవర్గ పరిధిలోని 20 వేల మంది విద్యార్థులకు సైకిళ్లు ఇచ్చానని, తన జీతం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 15 వేల మంది పదోతరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజులు చెల్లించానని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి గ్రామాలు అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని బండి సంజయ్ అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande