రాజధాని అమరావతిలో జ్యూడీషియల్ అకాడమీ నిర్మాణానికి సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ శంకుస్థాపన
అమరావతి, 01 మార్చి (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఆదివారం రాజధాని అమరావతి సమీపంలోని పిచ్చుకల పాలెం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్ట
రాజధాని అమరావతిలో జ్యూడీషియల్  అకాడమీ నిర్మాణానికి సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ శంకుస్థాపన


అమరావతి, 01 మార్చి (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఆదివారం రాజధాని అమరావతి సమీపంలోని పిచ్చుకల పాలెం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, సీఎం చంద్రబాబు నాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నర్సింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ జోయ మాల్యా బాగ్చి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తోపాటు పలువురు న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande