ఖమ్మంలో దౌర్జన్యంగా పేదల ఇళ్లు కూల్చేశారు: రామచందర్రావు
నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా పేదల ఇళ్లను కూల్చివేశారని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు
BJP chiefstate


ఖమ్మం, 01 మార్చి (హి.స.)నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా పేదల ఇళ్లను కూల్చివేశారని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. ఖమ్మం శివారు వెలుగుమట్లలోని భూదాన్ భూములను ఆయన పరిశీలించారు. భూ నిర్వాసితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో రామచందర్రావు మాట్లాడారు.

‘‘భూదాన్ బోర్డు పట్టాలున్న పేదల ఇళ్లను కూల్చివేశారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. పేదల వ్యతిరేక ప్రభుత్వం. పేదల ఇళ్లు కూలగొట్టి ఏం సాధించారు?బాధితుల పక్షాన భాజపా పోరాడుతుంది. కూల్చిన చోట పేదలకు 100 గజాల్లో ఇల్లు నిర్మించి ఇవ్వాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే పేదలను పంపించేస్తున్నారు’’ అని ఆయన ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande